2/17/09
వంకాయ పచ్చడి
కావలసిన పదార్ధాలు:
వంకాయలు : రెండు
ఆవాలు: ఒక స్పూను
మెంతులు: అర స్పూను
మినపప్పు : ఒక స్పూను
పచ్చిమిర్చి : మూడు
ఎండుమిర్చి : రెండు
ఇంగువ: ఒక స్పూను
ఉప్పు : రుచికి తగినంత
చింతపండు: కొంచెం
పంచదార: ఒక స్పూను
ఉల్లిపాయలు: ఒకటి ( పెద్దది ) ( ఆప్షనల్ )
తయారు చేసే విధానం :
ముందుగా వంకాయకు కొద్దిగా నూనె రాసి గ్యాసు మీద పెట్టి బాగా కాల్చుకోవాలి. పైన తొక్క అంతా నల్లగా అయ్యేవరకు.
తరువాత దాన్ని చల్లార్చి పైన పొట్టు అంతా తీసెయ్యాలి. నీళ్ళలో చెయ్యితడుపుకుంటూ పొట్టు తీస్తే బాగా వస్తుంది. తరువాత పొట్టు తీసిన వంకాయని చిదిమేయ్యాలి.
ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి. గ్యాసు మీద బాణీ పెట్టి అందులో ఒకస్పూను నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించి , గ్యాసు మీద నుండి దించేసి, చల్లార నివ్వాలి.
ఇప్పుడు గ్యాసు మీద ఒక బాణీ పెట్టి అందులో ఒక స్పూను నూనె వేసి కాగాక ఆవాలు, మినపప్పు, మెంతులు, ఇంగువ, పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చి వేసి పోపు వేయించుకోవాలి.
పోపు చల్లారాక మిక్సీలో వేసి కొంచెం చింతపండు, ఉప్పు, కొంచెం పంచదార వేసి గ్రైండ్ చెయ్యాలి. చివరిలో చిదిమిన వంకాయ కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చెయ్యాలి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిలో వేయించిన ఉల్లిపాయలుకలుపుకోవాలి. వంకాయ పచ్చడి రెడీ....ఈ పచ్చడి తాజా తెల్ల వంకాయలతో చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ...
Subscribe to:
Post Comments (Atom)
ఇంకోటి చెప్పనా? ఈ వంకాయ పచ్చడి ని కొంచెం పక్కన వేసుకొని, ఆవకాయ అన్నం లో కొంచెం అద్దుకొని తింటూ ఉంటే - చాల బాగుంటుంది :). మీరు వ్రాసిన విధానం చాలా సులువుగా ఉంది.
ReplyDelete