కావలసిన పదార్ధాలు :
పూరీలు కొరకు:
బొంబాయి రవ్వ - వంద గ్రాములు ( సుమారుగా వంద పూరీలు తాయారు చేసుకోవచ్చు)
మైదా - ఒక పెద్ద టీ స్పూన్
బేకింగ్ పౌడర్ - సగం టీ స్పూను
నూనె - పూరీలు వేయించుకోడానికి తగినంత
పానీ పూరిలో పోసె నీరు కొరకు :
నీరు - అర లీటరు
పుదినా - ఒక కట్ట
కొత్తిమీర - ఒక కట్ట
పచ్చిమిర్చి - నాలుగు లేక ఐదు
జల్జీర - ఒక స్పూను ( మార్కెట్లో పౌడర్ దొరుకుతుంది )
నల్ల ఉప్పు - అర స్పూను
పంచదార - ఒక స్పూను
ఉప్పు - తగినంత
నిమ్మకయ - ఒకటి
పూరిల్లో పెట్టే మిశ్రమం తయారుచేయ్యడానికి:
బంగాళా దుంపలు - రెండు పెద్దవి
బఠానీ - యాభై గ్రాములు
ఉప్పు - రుచికి తగినంత
కారం - అర స్పూను
జీలకర్ర పొడి - ఒక స్పూను
స్వీట్ చట్నీ కొరకు :
చింతపండు - యాభై గ్రాములు
బెల్లం - యాభై గ్రాములు
ధనియాల పొడి - ఒక స్పూను
కారం - అర స్పూను
తయారు చేసే విధానం :
పూరీలు :
బొంబాయి రవ్వ , మైదాపిండి మరియు బేకింగ్ పౌడర్ మూడింటిని నీళ్ళతో చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి వత్తుకోవచ్చు లేదా కటర్ సాయంతో గుండ్రముగా కట్ చేసుకోవచ్చు.
తరువాత పూరీలను కాగిన నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
నీరు తయారు చేయు విధానము:
పుదినా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పంచదార మరియు ఉప్పు మిక్సి లో వేసి పేస్టు లాగా తయారు చేసుకోవాలి. ఆ పేస్టుని అర లీటరు నీటిలో కలుపుకోవాలి. ఆ నీటిలో నల్ల ఉప్పు , జల్జిర మరియు నిమ్మ రసం కలుపుకోవాలి. అలా తయారైన నీటిని ఫ్రిజ్జులో రెండు గంటల పాటు పెట్టుకోవాలి.
పూరిలో పెట్టే మిశ్రమం తయారు చేసే విధానం :
ముందుగ బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. తరువాత బంగాళదుంపలను మరియు బఠానీని కుక్కరులో పెట్టి వుడికించుకోవాలి. ఉడికిన దుంపలను చిదుముకోవాలి. ఆ మిశ్రమంలో చింతపండు, ఉప్పు, జీలకర్ర పొడి మరియు కారం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. రుచికి కావలిస్తే కొత్తిమెర తరుగు కూడా కలుపుకోవచ్చు.
స్వీట్ చట్నీ తాయారు చేసే విధానం:
ముందుగ చింతపండుని నీళ్ళలో నానబెట్టుకోవాలి. తరువాత చింతపండు, బెల్లం, ధనియాల పొడి మిక్సిలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్టు లో ఒక కప్పు నీరు పోసి దానిని బాణిలో పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. తరువాత చల్లార్చు కోవాలి.
పూరికి ఒక చిన్న రంధ్రం చేసి అందులో బంగాళదుంప మిశ్రమం పెట్టి కొంచెం స్వీట్ చట్నీ వేసి పానీ పూరి నీరు కూడా పోసుకొని లాగించేయ్యడం అంతే......
కొంచెం సమయం పట్టినా కూడా ఎంతో రుచికరమైన పాని పూరి మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేస్తారు కదూ...ఆల్ ది బెస్ట్....
No comments:
Post a Comment