12/16/08

బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ - మంచూరియా



కావలసిన పదార్ధాలు :


ఫ్రైడ్ రైస్ కొరకు :
అన్నం - అర కిలో
క్యారెట్ - రెండు
బీన్సు - వంద గ్రాములు
ఉల్లి కోళ్ళు ( స్ప్రింగ్ ఆనియన్స్ ) - వంద గ్రాములు
బేబీ కార్న్ - వంద గ్రాములు
కాబేజీ - వంద గ్రాములు
సోయ్ సాస్ - అర టీ స్పూను
చిల్లి సాస్ - రెండు టీ స్పూన్లు
అజినమోటో - చిటికెడు
వెనిగర్ - ఒక టీ స్పూన్
నూనె - తగినంత
ఉప్పు - తగినంత

మంచూరియా కొరకు :
క్యారెట్ - వంద గ్రాములు
బీన్సు - వంద గ్రాములు
కాబేజీ - వంద గ్రాములు
ఉల్లి కోళ్ళు - వంద గ్రాములు
చిల్లి సాస్ - నాలుగు టీ స్పూన్లు
సోయ్ సాస్ - రెండు టీ స్పూన్లు
టమాటా సాస్ - మూడు టేబుల్ స్పూన్లు
అజినమోటో - చిటికెడు
నూనె - వేయిన్చు కోడానికి తగినంత
వెల్లుల్లి - మూడు (చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి)
కార్న్ ఫ్లౌర్ - మూడు స్పూన్లు సుమారు
మైదా - నాలుగు లేదా ఐదు స్పూన్లు సుమారు

తయారు చేసే విధానము:

ఫ్రైడ్ రైస్ :

ముందుగా అన్నము వండుకొని బాగా చల్లార బెట్టాలి. మెతుకులు విడి విడిగా వచ్చేలాగా అన్నము వండుకోవాలి. వండిన అన్నములో రెండు స్పూన్లు నూనె వేసి చల్లార బెట్టుకుంటే మెతుకులు విడి విడిగా వస్తాయి.క్యారెట్, బీన్సు, కాబేజీ, బేబీ కార్న్ మరియు ఉల్లి కోళ్ళను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. ఒక బాణీ తీసుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి. తరువాత అందులో క్యారెట్, బేబీ కార్న్ మరియు బీన్సు వేసుకొని వాటిని వేగనివ్వాలి.

తరువాత ఉల్లి కోళ్ళు వేసుకోవాలి. ఒక్కసారి వేగనివ్వాలి. ఇప్పుడు చల్లారిన అన్నం అందులో వెయ్యాలి. అన్నం అన్ని కూరలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి .

అందులో చిల్లి సాస్ , సోయ్ సాస్, అజినమోటో , ఉప్పు మరియు వెనిగర్ వెయ్యాలి.

అన్ని బాగా కలుపుకోవాలి. ఒక ఐదు నిముషాలు గాస్ మీదే ఉంచి దిన్చేసుకోవాలి.

మంచూరియా తయారు చేసే విధానం :
క్యారెట్, బీన్సు, కాబేజీ మరియు ఉల్లి కోళ్ళను బాగా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని ముక్కలను పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ముక్కలను అన్నిటిని కలిపి ఒక బౌల్ లో వేసుకోవాలి. అందులో రెండు స్పూన్ల చిల్లి సాస్, ఒక స్పూన్ సోయ్ సాస్ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అందులో మైదా పిండి ఇంకా కార్న్ ఫ్లౌర్ కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు అవ్వడానికి వీలుగా ఉండేలాగా తయారు చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బాణిలో మంచూరియా వేగడానికి సరిపోయే నూనెను పోసి గాస్ మీద పెట్టి కాగ నివ్వాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేయించిన మంచూరియాను పక్క పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బాణిలో రెండు స్పూన్ల నూనె పోసి అందులో తరిగి ఉంచుకున్న వెల్లుల్లిని వేసి వేయించుకోవాలి. తరువాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న కూరగాయల ముక్కలను నూనెలో వెయ్యాలి. బాగా వేగనివ్వాలి. తరువాత అందులో మూడు టేబులు స్పూన్ల టమాటా సాస్, రెండు టీ స్పూన్ల చిల్లి సాస్, ఒక టీ స్పూన్ సోయ్ సాస్ , చిటికెడు అజినమోటో, రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నీరు పోసి బాగా ఉడక నివ్వాలి.

దెగ్గర పడటానికి ఒక స్పూను కార్న్ ఫ్లౌర్ కొద్దిగా నీళ్ళలో కలిపి మిశ్రమాన్ని పైన ఉడుకుతున్న దాంట్లో పొయ్యాలి. బాగా కలపాలి. దెగ్గర పడ్డాక అందులో ఇందాక మనం వేయించి పెట్టుకున్న మంచూరియాలను అందులో కలపాలి.

మూడు నిమిషాలు ఉడకనిచ్చి పైన ఉల్లి కోళ్ళు ముక్కలు చల్లాలి. స్టవ్ అపుచేసుకోవాలి. అంతే మంచూరియా తయారు......


చైనీస్ హొటలులో చేసినంత రుచిగా తయారు అవుతుంది మీ ఫ్రైడ్ రైస్ మరియూ మంచూరియా ....అదీ ఇంట్లోనే ....ఇంక ఎందుకు ఆలస్యం ....మొదలెట్టండి మరి....
















No comments:

Post a Comment