Showing posts with label Snacks. Show all posts
Showing posts with label Snacks. Show all posts

10/14/09

కాజాలు లేదా చెక్కర బాణాలు


మా ఇంట్లో వీటిని కాజాలని అంటాము. మా అత్తారింట్లో వీటిని చెక్కర బాణాలని అంటారు. కాబట్టి రెండు రాసాను. ఇవి కాకినాడ కాజా మరియు మడత కాజా లాగా కాకుండా చాల సులువుగా చేసుకోవచ్చు.

కావలసిన పదార్ధాలు :
మైదా పిండి : అర కిలో
ఉప్పు : రుచికి తగినంత
నూనె : వేయించడానికి తగినంత
బెల్లం లేదా పంచదార: అర కిలో

తయారు చేసే విధానం:
వీటిని పాకం పట్టుకోవచ్చు లేదా ఉప్పు కారం వేసి కమ్మగా చేసుకోవచ్చు. స్వీటు హాటు కూడా చేసుకోవచ్చన్నమాట. ముందుగా మైదా పిండి తీసుకొని అందులో కమ్మటి వాటికైతే ఉప్పు కలపాలి, తీపి వాటికి అక్కరలేదు. మైదా పిండిలో కొంచెం ( నాలుగు అయిదు స్పూన్లు) కాచిన నూనె కలుపుకోవాలి. అప్పుడు కాజాలు గుల్లగా వస్తాయి. తరువాత తగినన్ని నీరు పోసి చపాతి పిండిలాగా కలుపుకోవాలి.

ఇప్పుడు పెద్ద పెద్ద ఉండలు చేసి పెద్ద చపాతీ లాగా వత్తుకోవాలి.

ఆ చపాతీని ముందు నిలువుగా తరువాత అడ్డంగా చాకుతో కోసుకోవాలి డైమెండ్ ఆకారం లో .

ఇప్పుడు అలా కోసిన వాటిని కాగిన నూనెలో దోరగా వేయించుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా వత్తి , కోసి వేయించుకోవాలి. కమ్మటివి కావాలనుకుంటే కొంచెం ఉప్పు కారం ఆ కాజాల మీద చల్లుకుని ఒక డబ్బాలో నిలువ ఉంచుకోవచ్చు. తియ్యటివి కావాలనుకుంటే పంచదార లేదా బెల్లం ముదురు పాకం పట్టి అందులో వేయించిన కాజాలు వేసి బాగా కలుపుకోవాలి , పాకం అన్ని కాజాలకి పట్టేలాగా . చల్లారిన తరువాత ఒక డబ్బాలో నిలువ చేసుకోవాలి.

పప్పు చెక్కలు


కావలసిన పదార్ధాలు :
వరిపిండి : అర కిలో
నీరు : అర లీటరు
శనగపప్పు : యాభై గ్రాములు ( రెండు గుప్పెళ్ళు సుమారు), రెండు గంటలు ముందుగా నానబెట్టుకోవాలి
కారం : రెండు స్పూన్లు లేదా పచ్చిమిర్చి పేస్టు : రెండు స్పూన్లు
కరివేపాకు: రెండు మూడు రెబ్బలు
ఉప్పు : రుచికి తగినంత
నూనె : వేయించడానికి సరిపడా

తయారు
చేసే విధానం:

ముందుగా గ్యాసు మీద ఒక బాణీ పెట్టుకొని అందులో నీరు పోసుకోవాలి. నీరు బాగా మరిగాక అందులో సెనగపప్పు, కారం , ఉప్పు, చిన్న చిన్నగా తుంపిన కరివేపాకు మరియు వరిపిండి వేసి బాగా కలుపుకోవాలి. గ్యాసు ఆపేసి తయారైన మిశ్రమాన్ని బాగా చల్లారా నివ్వాలి.

ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న ఉండలాగా చేసి ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ అరిటాకు మీద కాని పల్చగా వత్తుకోవాలి.


అలా
వత్తిన వాటిని బాగా కాగిన నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి . ఇలాగే మిగిలిన పిండితో కూడా చెక్కలు వత్తుకొని వేయించుకోవాలి. చల్లారిన చక్కలను ఒక గట్టి మూత ఉన్న డబ్బాలో పెట్టి నిలువ ఉంచుకోవచ్చు.

7/17/09

సగ్గుబియ్యం వడలు


కావలసిన పదార్ధాలు:

సగ్గుబియ్యం : పావు కిలో
బంగాళా దుంపలు: మూడు
పచ్చిమిర్చి : అయిదు లేక ఆరు
కొత్తిమీర: ఒక కట్ట
కరివేపాకు: రెండు రెబ్బలు
జీలకర్ర: ఒక చెంచా
వేరుశనగ పప్పు లేదా పల్లీలు : రెండు గుప్పెళ్ళు
ఉప్పు : రుచికి తగినంత
నూనె : వేయించటానికి సరిపడా

తయారు చేసే విధానం:
ముందుగా సగ్గుబియ్యం రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. బంగాలదుంపలు చెక్కు తీసి ఉడకబెట్టుకోవాలి. ఉడికినవాటిని మెత్తటి ముద్దలాచేసి పక్కన పెట్టుకోవాలి. వేరుసెనగపప్పు వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి . పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
సగ్గుబియ్యం నానాకా నీళ్లు ఏమైనా మిగిలితే తీసెయ్యాలి. ఇప్పుడు నానిన సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి.అందులో ఇందాక మనం ముద్ద చేసిపెట్టుకున్న బంగాళా దుంపల మిశ్రమాన్ని కలపాలి. అలాగే వేరుసెనగపప్పుపొడిని, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర మరియు ఉప్పు వేసిఅన్నిటిని బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాణీ పెట్టుకొని అందులో తగినంత నూనె పోసికాగనివ్వాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కాని అరటి ఆకు కాని తీసుకొని సగ్గుబియ్యం మిశ్రమాన్ని తీసుకొని వడలాగా వత్తుకోవాలి.

వడని కాగుతున్న నూనెలోవేసి దోరగా వేయించుకోవాలి.

ఎంతో
రుచిగా కరకరలాడే సగ్గుబియ్యం వడలు తయారు అయినట్టే.

నేను ఈవంటకాన్ని ఈనాడు పేపర్లో చూసి ట్రైచేశాను...చాల బాగా వచ్చాయి....మీరూ తప్పక ట్రై చెయ్యండి మరి....వానాకాలం లో సాయంకాలం పూట వడలు చేసుకుంటే చాల బాగుంటుంది కదా....??
















12/11/08

పానీ పూరి









కావలసిన పదార్ధాలు :

పూరీలు కొరకు:
బొంబాయి రవ్వ - వంద గ్రాములు ( సుమారుగా వంద పూరీలు తాయారు చేసుకోవచ్చు)
మైదా - ఒక పెద్ద టీ స్పూన్
బేకింగ్ పౌడర్ - సగం టీ స్పూను
నూనె - పూరీలు వేయించుకోడానికి తగినంత



పాన పూరిల పోస నీర కొరక :

నీర - అర లీటర
పుదిన - ఒక కట్ట
కొత్తిమీర - ఒక కట్ట
పచ్చిమిర్చి - నాలుగ లేక ఐద
జల్జీర - ఒక స్పూన ( మార్కెట్ల పౌడర దొరుకుతుంది )
నల్ల ఉప్ప - అర స్పూన
పంచదార - ఒక స్పూన
ఉప్ప - తగినంత
నిమ్మకయ - ఒకటి

పూరిల్ల పెట్ట మిశ్రమ తయారుచేయ్యడానికి:

బంగాళ దుంపల - రెండ పెద్దవి
బఠాన - యాభ గ్రాముల
ఉప్ప - రుచికి తగినంత
కార - అర స్పూన
జీలకర్ర పొడి - ఒక స్పూన

స్వీట చట్న కొరక :

చింతపండ - యాభ గ్రాముల
బెల్ల - యాభ గ్రాముల
ధనియాల పొడి - ఒక స్పూన
కార - అర స్పూన


తయారు చేసే విధానం :

పూరీల :
బొంబాయి రవ్వ , మైదాపిండి మరియ బేకింగ పౌడర మూడింటిని నీళ్ళత చపాత పిండిల కలుపుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగ చేసి వత్తుకోవచ్చ లేద కటర సాయంత గుండ్రముగ కట చేసుకోవచ్చ.


తరువాత పూరీలన గిన నూనెల వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.


నీర తయార చేయ విధానమ:
పుదిన, కొత్తిమీర, పచ్చిమిర్చి, పంచదార మరియ ఉప్ప మిక్సి వేసి పేస్ట లాగ తయార చేసుకోవాలి. పేస్టుని అర లీటర నీటిల కలుపుకోవాలి. నీటిల నల్ల ఉప్ప , జల్జిర మరియ నిమ్మ రస కలుపుకోవాలి. అల తయారైన నీటిని ఫ్రిజ్జుల రెండ గంటల పాట పెట్టుకోవాలి.



పూరిల పెట్ట మిశ్రమ తయార చేస విధాన :
ముందుగ బంగాళదుంపలన చిన్న చిన్న ముక్కలుగ తరుగుకోవాలి. తరువాత బంగాళదుంపలన మరియ బఠానీని కుక్కరుల పెట్టి వుడికించుకోవాలి. ఉడికిన దుంపలన చిదుముకోవాలి. మిశ్రమంల చింతపండు, ఉప్ప, జీలకర్ర పొడి మరియ కార కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. రుచికి కావలిస్త కొత్తిమెర తరుగ కూడ కలుపుకోవచ్చ.


స్వీట చట్న తాయార చేస విధాన:
ముందుగ చింతపండుని నీళ్ళల నానబెట్టుకోవాలి. తరువాత చింతపండ, బెల్ల, ధనియాల పొడి మిక్సిల వేసి గ్రైండ చేసుకోవాలి. పేస్ట ఒక కప్ప నీర పోసి దానిని బాణిల పోసి స్టవ మీద పెట్టి బాగ మరిగించుకోవాలి. తరువాత చల్లార్చ కోవాలి.



పూరికి ఒక చిన్న రంధ్ర చేసి అందుల బంగాళదుంప మిశ్రమ పెట్టి కొంచె స్వీట చట్న వేసి పాన పూరి నీర కూడ పోసుకొని లాగించేయ్యడ అంత......

కొంచె సమయ పట్టిన కూడ ఎంత రుచికరమైన పాని పూరి మన ఇంట్లోన తయార చేసుకోవచ్చ. మీర కూడ ట్ర చేస్తార కద...ఆల ి బెస్ట....